Site icon TeluguMirchi.com

బాల‌య్యతో రాధికా ఆమ్టే??

balakrishan radika ampteనంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో రూపొందుతున్న సినిమాకి ఇప్పటి వ‌ర‌కూ రెండు ఆటంకాలు ఎదుర‌య్యాయి. ఒక‌టి ఈ సినిమా టైటిల్ విష‌యంలో, రెండోది క‌థానాయిక దొర‌క్క‌. ఇవి రెండూ ఓ కొలిక్కి వ‌చ్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమాకి లెజెండ్ అనే పేరు ఖరారు చేసిన‌ట్టు విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. అంతేకాదు రెండో నాయిక కూడా దొరికేసింది. ఆమే రాధికా ఆమ్టే. ర‌క్త చ‌రిత్ర‌, ధోనీ సినిమాల్లో కీల‌క పాత్రలు పోషించింది. ఇప్పుడు బాల‌య్యతో సూప‌ర్ ఛాన్స్ కొట్టేసింది. త్వర‌లోనే అధికారికంగా దృవీక‌రిస్తారు.

Exit mobile version