
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రమే ‘రాధే శ్యామ్’. ఈ మూవీ ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేసారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడంతో చిత్రానికి సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమాలో ప్రతీ కంటెంట్‌ను ఆస్వాదించాను. బిగ్ స్క్రీన్‌పై ఈ ప్రేమ కథా దృశ్యకావ్యాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసాడు. ప్రభాస్, వంశీ అన్న భారీ విజయాన్ని అందుకోవాలని ఎదురు చూస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విజయాల పరంపర కొనసాగించాలని కోరుకొంటున్నాను. పూజా హెగ్డే, రాధాకృష్ణ, యూవీ క్రియేషన్స్‌కు ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.
రాధేశ్యామ్ సినిమా యూనిట్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చూడని గ్రాండ్ లవ్ స్టోరి. ఆన్ స్క్రీన్‌పై ప్రభాస్ డార్లింగ్‌ను చూడటానికి ఎదురు చూస్తున్నాను. థియేటర్లలో రాధేశ్యామ్‌ను చూడటానికి వెళ్లండి అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.
వెండితెరపై మ్యాగ్నమ్ ఓపస్ మూవీ రాధేశ్యామ్ విడుదలైంది. ఈ సినిమాను వెండితెరపై చూడటానికి ఎదురు చూస్తున్నాను. ప్రభాస్, పూజా హెగ్డే, వంశీకి నా అడ్వాన్స్ కంగ్రాంట్స్ అంటూ మెహెర్ రమేష్ ట్వీట్ చేశాడు.
ప్రభాస్ డార్లింగ్‌కు నా బెస్ట్ విషెస్. రాధేశ్యామ్ యూనిట్‌కు శుభాకాంక్షలు. వెండితెరపై భారీ ప్రేమ కథా చిత్రాన్ని చూడటానికి ఎదురు చూస్తున్నాం అని గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు.
రాధేశ్యామ్ సినిమాతో డార్లింగ్ ప్రభాస్ మరో బ్లాక్‌బస్టర్ సినిమాను అందుకోవాలని కోరుకొంటున్నాను. వెండితెరపై అరుదైన ప్రేమ కథను తెరకెక్కించడానికి వారు పడిన శ్రమను, యూనిట్ పెట్టిన కష్టానికి ఫలితం అందబోతున్నది అని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది.
ప్యాన్ ఇండియా కింగ్ ప్రభాస్ సార్.. పూజా హెగ్డే గారు.. డైరెక్ట ర్ రాధా బ్రదర్, వంశీ అన్నా, ప్రమోద్ గారు, వికీ అన్నా, యూవీ క్రియేషన్స్, రాధేశ్యామ్ టీమ్‌కు నా శుభాకాంక్షలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కంటే మించిన విజయాన్ని సాధించాలని కోరుకొంటున్నాను అని వెంకీ కుడుముల ట్వీట్ చేశాడు.
రాధేశ్యామ్ గొప్ప ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. సిల్వర్ స్క్రిన్‌పై చూడటానికి ఎదురు చూస్తున్నాను అని హను రాఘవపూడి ట్వీట్ చేశాడు.
దర్శకుడు మారుతి ట్వీట్ చేస్తూ.. కానీ డార్లింగ్ సినిమా అంటే మేము మళ్ళీ మళ్ళీ చూస్తాం అని ట్వీట్ చేసాడు.