సీసీసీ కి మూడు లక్షల విరాళం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.

ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఛారిటీకి చాలామంది సినీ ప్రముఖులు తమవంతు వైరల్ అందజేయగా ప్రముఖ నిర్మాత రాధామోహన్ మూడు లక్షల విరాళం అందజేశారు. అధినేత చిత్రంతో ఇండస్ట్రీ లోకి నిర్మాత గా అడుగుపెట్టిన ఈయన..ఆ తర్వాత పలు సినిమాలు చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో ఒరేయ్ బుజ్జి సినిమా చేశారు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.