చేప పిల్లకి ఈత నేర్పాలా ?

radhaతన కూతురుపై జరుగుతోన్న ప్రచారం పట్ల రాధ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. నటన నేర్చుకోవలసిన అవసరం తన కూతురికి లేదంటూ మండిపడుతోంది. విషయమేమిటంటే… రాధ రెండో కూతురు తులసి’ కడల్’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంటోన్న సమయంలో, తులసికి నటించడం చేతకాదని … ఇక మరో కథానాయికను వెదికే సమయం లేక మణిరత్నం ఆమెతోనే ఆ పాత్రను చేయిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పట్ల రాధ తీవ్రమైన స్థాయిలోస్పందిస్తూ …. నటనలో నా ప్రత్యేకత ఏమిటో నిరూపించుకున్నాను. అలాంటిది నా కుమార్తెలు నిరూపించుకోలేరా? చేప పిల్లకు ఈత నేర్పించాల్సిన అవసరంలేదు. తులసి నటనపై అనుమానాలున్నవారు షూటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి రండి, అప్పుడు అర్థమవుతుందని గట్టిగానే చెప్పింది. అయితే రాధ వ్యాఖ్యలపై దర్శకుడు మణిరత్నం గాని, చిత్ర బృందం గాని స్పందించలేదు.