‘రాధ’ చిత్రం విడుదలయిన తొలి వారాంతంలో తెలుగు రాష్ట్రాలను కలుపుకుని మొత్తం 4.5కోట్ల షేర్‌ను వసూలు చేయగా మిగతా ఏరియాల్లో సుమారు 60లక్షలను రాబట్టింది. మొత్తంగా ‘రాధ’ చిత్రం మొదటి వారాంతంలో దాదాపుగా 5.1కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ లెక్కన చూసుకుంటే శర్వా కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘శతమానం భవతి’ చిత్రం తొలి వారాంతంలో 7.15కోట్లను రాబట్టింది. పండగ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే ‘రాధ’ పాజిటివ్ టాక్ తగ్గట్టుగానే ‘శతమానం భవతి’ కంటే 2కోట్లు తక్కువగా వచ్చాయి. దీంతో కూడా పెద్దగా నష్టం ఏమి లేదు అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.