Site icon TeluguMirchi.com

బ‌న్నీ సినిమా… బాలీవుడ్‌కి

race gurram
రేసుగుర్రం అల్లు అర్జున్‌కి తీపి గురుతుల్ని మిగులుస్తోంది. స‌మ్మ‌ర్ హిట్‌గా సినీ పండితులు రేసుగురర్రానికి కితాబులు ఇచ్చేశారు. రూ.40 కోట్ల సాధ‌న దిశ‌గా రేసుగుర్రం దూసుకుపోతోంది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్‌కీ వెళ్ల‌బోతోంద‌ని టాక్‌. కొంత‌మంది బాలీవుడ్ నిర్మాత‌లుఎప్ప‌టి నుంచో సురేంద‌ర్‌రెడ్డి తో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే అది కుద‌ర‌డం లేదు. ఊస‌ర‌వెల్లి సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌న్న‌ది వారి ప్ర‌య‌త్నం. అయితే రేసుగుర్రం చూశాక‌.. అభిప్రాయం మార్చుకొన్నార‌ట‌. తీస్తే.. ఈ సినిమానే బాలీవుడ్‌లో తీద్దాం అని ప‌ట్టుప‌డుతున్నార‌ట‌. సురేంద‌ర్ రెడ్డి కూడా అందుకు రెడీగానే ఉన్నాడు. కొన్ని మార్పులు, చేర్పుల‌తో ఈ సినిమాని బాలీవుడ్‌కి తీసుకెళ్ల‌బోతున్నారు. మ‌రి బ‌న్నీ ప్లేసులో ఎవ‌రోస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

Exit mobile version