రేసుగుర్రం రిలీజ్ డేట్‌

Allu-Arjun-Race-Gurram1(1)ఇద్ద‌ర‌మ్మాయిల‌తో ఫ‌లితం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ని నిరాశ‌ప‌రిచింది. ఇప్పుడు ఆయ‌న ఆశ‌ల‌న్నీ రేసుగుర్రంపైనే. ఇదో స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకొంటోంది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. మార్చి ద్వితీయార్థంలో పాట‌ల్ని విడుద‌ల చేయ‌నున్నారు. రేసుగుర్రంకి సంబంధించి ట్రాక్ లిస్ట్ ఇప్ప‌టికే బ‌య‌టకు వ‌చ్చేసింది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. బ‌న్నీ సినిమాకి త‌మ‌న్ సంగీతం అందించ‌డం ఇదే తొలిసారి. రేసుగుర్రం ట్రాక్ లిస్ట్ ఇదే…

1.బూచాడే..బూచాడే
2.స్వీటీ
3. సినిమా చూపిస్తా మావా
4.గలగల
5. డౌన్ డౌన్
6. రేసుగుర్రం..