’రేసుగుర్రం’ ఫస్ట్ డే కలక్షన్స్ !

Race-Gurram-First-day-Colle

స్టయిల్ స్టార్ అల్లు అర్జున్ ’రేసుగుర్రం’ ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొంది.కలక్షన్స్ లో గుర్రం దూసుకెళ్తుతోంది. శుక్రవారం ఒక్కరోజే 8.2 కోట్లను వసూలు చేసింది. హిట్ టాక్ రావడంతో శనివారం నుంచే కలక్షన్స్ భారీగా పెరగవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాలయ్య లెజెండ్ తప్ప..  మిగితా సినిమాలేవీ అంత గొప్పగా లేకపోవడం గుర్రానికి మరింత కలసొచ్చింది. పైగా.. వేసవి సెలవులు. దీంతో.. ఎంటరై టైమెంట్ ను పంచే ’రేసుగుర్రం’ వైపు దౌడుతీస్తున్నారు ప్రేక్షకులు. బన్నీ ఎనర్జిటిక్ ఫర్ ఫామెన్స్, బ్రహ్మీ కామెడీ, శృతి శృతిమించిన గ్లామర్, దర్శకుడు సురేందర్ రెడ్డి స్టలీష్ టేకింగ్ ప్రేక్షకులను గుర్రం వైపు పరుగులు తీయిస్తున్నాయి. గుర్రం మరో వారం రోజులు ఇలాగే పరిగెడితే.. బాక్సాఫీస్ షేక్ అయినట్లే.. !