ఎన్టీఆర్ సినిమా రభసకి కష్టాలు తప్పడం లేదు. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని కొబ్బరికాయ్ కొట్టినప్పటి నుంచీ అనుకొంటూనే ఉన్నారు. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. దర్శకుడు సంతోష్ శ్రీన్వాస్ అనారోగ్యం వల్ల… రభస జాప్యం అవుతూ వచ్చింది. ఇప్పుడాయన కోలుకొన్నారు. సో… జూన్లో రభసని ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనుకొన్నారు. అయితే అనుకొన్న సమయానికి రభస రెడీ కాదట. ఈ సినిమాని మరింత ఆలస్యంగా.. జులైలో ఈ సినిమాని విడుదల చేస్తారని సమాచారమ్. టాకీ పార్ట్ ఇంకా తీయాల్సి ఉందని, అవన్నీ అయిపోయాక నిర్మాణానంతర కార్యక్రమాలకు మరింత సమయం తీసుకోవాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ భావిస్తున్నారట. హడావుడిగా సినిమాని జనం ముందుకు తీసుకెళ్లకుండా ప్రమోషన్ల కోసం సమయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. సో… ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నిరీక్షణ తప్పదన్నమాట.