Site icon TeluguMirchi.com

‘ఖైదీ’ గర్ల్ ఆనందానికి అవధులేవట..

laxmi-rai-item-khadiమెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రంగా వి.వి.వినాయక్ దర్శకత్వం లో ‘ఖైదీ నెం.150’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఐటెం సాంగ్ షూట్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నేతృత్వం లో ఈ సాంగ్ జరుగుతుంది.

కాగా ఈ ఐటెం సాంగ్ లో మెగా స్టార్ తో మాస్ స్టెప్స్ వేసిని రాయ్ లక్ష్మి..దీనికి సంబంధించిన ఫోటో తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్ ‘లో పవన్ కళ్యాణ్ తో ‘తోబ..తోబ’ అంటూ అదరగొట్టిన రాయ్ లక్ష్మి , ఇప్పుడు చిరంజీవి తో చిందులేయడం అంతో ఆనందంగా ఉందని పేర్కొంది..:చిరంజీవి గారి చిత్రం లో ఐటం సాంగ్ చేస్తున్నానంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. ఆయన అంటే నాకెంతో అభిమానం’ అని తెలిపింది లక్ష్మీ రాయ్.


ఈ ఐటం సాంగ్ చిరంజీవి కుమార్తె సుస్మిత పర్యవేక్షణలో సాగడం విశేషం. ముందుగా ఈ సాంగ్ లో కేథరిన్ నటిస్తుందని ప్రచారం జరిగిన ఆ తర్వాత స్మితతో గొడవ పడడంవల్లే కేథరిన్ ఈ చిత్రం నుంచి ఔట్ అయిందని వార్తలు వినిపించాయి.

Exit mobile version