Site icon TeluguMirchi.com

‘టెంపర్’ లో ఆర్‌.నారాయణమూర్తి…!

temper-rnarayanamurthiఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పవర్ ఫుల్ మూవీ ‘టెంపర్’. ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తి కరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకి ఆ న్యూస్ ఎంటింటే…” ఈ చిత్రం లో విప్లవాత్మక చిత్రాలు నిర్మిస్తూ తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు ఆర్‌.నారాయణమూర్తి నటిస్తున్నడనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో బాగా ప్రచారం జరుగుతుంది.

ఆర్‌.నారాయణమూర్తికి పూరి పెద్ద అభిమాని అన్న సంగతి అందరికి తెలుసు. అందుకోసమే పూరి, పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ చిత్రాన్ని మూర్తి గారికి అంకితం ఇచ్చాడు. ఆయన ఫై ఉన్న గౌరవం తో టెంపర్ చిత్రం లో పూరి ఓ అద్భుతమైన పాత్ర డిజైన్‌ చేశాడట. దీనికోసం నారాయణ మూర్తిని సంప్రదిస్తే అతను దానిని రిజెక్ట్‌ చేశాడని, కమర్షియల్‌ చిత్రాల్లో నటించించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం తో ఈ చిత్రాన్ని రిజెక్ట్‌ చేశారని సమాచారం.

పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై వస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ని ఈ నెల 26 న విడుదల చేయబోతున్నారు. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రం విడుదల కాబోతుంది.

Exit mobile version