పుష్ప 2 నుండి క్రేజీ అప్డేట్ !


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా.. విదేశాల్లో సైతం సత్తా చాటింది. ఈ మూవీతో బన్నీ, రష్మిక పాన్ ఇండియా స్తాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో పుష్ప 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాదు పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఫ్యాన్ అంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు 11.07 గంటలకు పుష్ప 2 అప్డేట్ అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చూడాలి మరి ఏం అప్డేట్ ఇస్తారో…