సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో పుష్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఆగష్టు 13 న ఈ చిత్రం విడుదల కానుంది.
ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పుష్ప టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. టీజర్ ఆధ్యంతం యెర్ర చందనం స్మగ్లింగ్ సన్నివేశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌంగ్ మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్. ‘తగ్గేదెలా’ అనే ఊతపదం సినిమాకి హైలైట్ కాబోతుందనటంలో సందేహమే లేదు. మీరు టీజర్ పై ఒక లుక్కేయండి…