#AA20 ఫస్ట్ లుక్ వచ్చేసింది

అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .ప్రస్తుతం తన 20 వ చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి కాగా..ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఈరోజు బన్నీ 38 వ పుట్టిన రోజు సందర్భాంగా చిత్రం తాలూకా అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ కి పుష్ప అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు అదే కావడం తో ఆ పేరే సినిమాకు పెట్టడం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ గడ్డం తో కనిపించాడు.