పూరి సినిమాలో ఆ ఇద్దరు లేరు..

Ali-Bhrmi-Puriపూరీ జగన్నాథ్ సినిమాలో కామెడీకి ఓ స్పెషల్ ఉంటుంది.. ఈయన చేసిన అన్ని సినిమాలలో ఆలీ కామెడీ సినిమా కు హైలైట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. సూపర్, అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి, చిరుత, దేశముదురు వంటి సూపర్ హిట్స్ లో అలీ కామెడీ అద్భుతంగా పడించాడు. అలాగే హాస్య నటుడు బ్రహ్మనందం కూడా పూరీ సినిమాలు మరో ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాడు.

అయితే, ఈసారి పూరి తన రూట్ ను మార్చుకున్నాడని వినికిడి. తన తాజా చిత్రం ‘టెంపర్’ లో మాత్రం
బ్రహ్మనందంనికి , అలీ కి అవకాశం ఇవ్వలేదు. అదుర్స్ చిత్రం తో తనలో కామెడీ యాంగిల్ ఉందని నిరూపించిన ఎన్టీఆర్..మరోసారి టెంపర్ లో కూడా అదే రిపేట్ చేయాలనీ పూరి డిసైడ్ అయి బ్రహ్మనందంన్ని , అలీ ని పక్కన పెట్టడం జరిగిందట. ఈ చిత్రం ఈనెల 13న ప్రేక్షేకుల ముందుకు రాబోతుంది.