సంపూర్ణేష్ బాబు. ది బర్నింగ్ స్టార్. ఆ ఫేసు కళ్ల ముందు మెదిలితే.. ఇక నవ్వు ఆపుకోవడం ఎవరి తరమూ కాదు. హృదయకాలేయం అంటూ తెగ కామెడీ చేసిన సంపూ.. బర్నింగ్ స్టార్ అయిపోయాడు.
‘హృదయ కాలేయం’తో నవ్వుల పువ్వులు పూయించిన సంపూర్ణేష్ బాబు ఇప్పుడు ‘కొబ్బరిమట్ట తో వస్తున్నాడు. సినిమాలోని ‘శంభో శివ శంభో’ అనే పాటను దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ‘బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు అంటే నాకు చాలా ఇష్టం. సంపూతో చాలా సార్లు పనిచేయాలనుకున్నా.. కుదరలేదు. తప్పకుండా భవిష్యత్తులో చేస్తాను. ‘కొట్టరిమట్ట’ టైటిల్ చాలా ఆసక్తిగా ఉంది. పాట చూశాను.. మాటలు లేవు, ఓన్లి చూడటాలే” అని చెప్పుకొచ్చారు.