Site icon TeluguMirchi.com

దీనెమ్మా కిక్కు…పూరి నువ్వో డ్రగ్గు..!

పూరీ డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన కొత్త సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా విషయంలో రామ్ లుక్ చూసిన నాటి నుండే ఈ సినిమా మీద అంచనాలు మొదలయ్యాయి. తాజాగా రిలీజయిన ఈ సినిమా ట్రైలర్లో ఆయన పాత్రను మలిచిన తీరు, డైలాగ్స్ చూస్తే హీరో క్యారెక్టర్ భిన్నంగానే ఉంటుందనిపిస్తోంది. ఇక ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు రామ్. తాజాగా సినిమాను వీక్షించానని పాత్రలో నటించేటప్పుడు ఎలాంటి కిక్ అయితే వచ్చిందో సినిమా చూస్తున్నప్పుడు కూడా అలాంటి కిక్కే వచ్చిందని ఆయన ట్వీట్ చేశాడు.

అలాగే సినిమా తీసిన పూరికి థాంక్స్ చెబుతూ పూరి జగన్నాథ్… చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మీరొక డ్రగ్ లాంటి వ్యక్తి అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ రామ్ టెంపర్ తరువాత హిట్ ముఖమే చూడని పూరీ ఇఇదరూ ఈ సినిమా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని టూరింగ్‌ టాకీస్‌, పూరి కనక్ట్‌ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version