Site icon TeluguMirchi.com

పంచ్ ఏది పూరీ…??

puriపూరి జ‌గ‌న్నాథ్ సినిమా అంటేనే పంచ్ డైలాగులు కోకొల్లలుగా ప‌డిపోతుంటాయి. హీరో ఎవ‌రైనా స‌రే, వాళ్ల బాడీ లాంగ్వేజీకి త‌గ్గట్టు డైలాగులు రాయ‌డంలో పూరి దిట్ట‌. అందులోనూ ఈరోజుల్లో టీజ‌ర్ అంటే దుమ్మెత్తిపోయే ఓ డైలాగ్ ఉండాల్సిందే. అయితే హార్ట్ ఎటాక్ తొలి టీజ‌ర్‌లో ఆ పంచ్ మిస్సయ్యింది. పూరి నుంచి ఆశించే డైలాగులేవీ ఈ టీజ‌ర్‌లో లేక‌పోవ‌డం వెలితిగా అనిపిస్తోంది. పూరి – నితిన్ ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం హార్ట్ ఎటాక్‌. ఆదాశర్మ క‌థానాయిక‌. ఈ సినిమా టీజ‌ర్‌ని సోమ‌వారం విడుద‌ల చేశారు. పాట‌, ఫైటుల‌పై దృష్టి పెట్టిన పూరి. మాట సంగ‌తి మ‌ర్చిపోయాడు. వ‌చ్చే టీజ‌ర్‌లో అయినా ఓ భారీ పంచ్ డైలాగ్ వ‌దులుతాడేమో చూడాలి.

Exit mobile version