పూరి వెనక్కి తగ్గడా ?

purijagannadhసినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ముందే రిలీజ్‌ డేట్‌ ను ప్రకటించడం దర్శకుడు పూరి జగన్నాధ్‌ స్పెషాలిటీ. చిత్రాన్ని చెప్పిన టైం కంటే ముందే ముగించేస్తాడు. రిలీజ్ కూడా జరిగిపోతుంటుంది. కాని ఈ సారి ‘హార్ట్ ఎటాక్’ విషయంలో డేటు మారేలా వుంది. నితిన్ హీరోగా పూరి తెరకెక్కించిన చిత్రం ‘హార్ట్ ఎటాక్.’ షూటింగ్ ముగించుకొని సంక్రాతి కి సిద్దమైంది. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ లో మార్పు వుండోచ్చని వినిపిస్తుంది. కారణం..మహేష్ బాబు ‘1’, రామ్ చరణ్ ‘ఎవడు’ సంక్రాతి రిలీజ్ కు సిద్దమయ్యాయి. రెండు భారీ బడ్జెట్ చిత్రాలే.దాదాపు ధియేటర్ల ఆక్రమించేస్తాయి. ఈ భారీ పోటిలో తన చిత్రానికి మంచి ధియేటర్లు కష్టమేనని , అందుకే ‘హార్ట్ ఎటాక్’ కు ఫిబ్రవరి రెండో వారంల్లో రిలీజ్ చేయడానికి పూరి డిసైడ్ అయ్యాడని వినిపిస్తోంది.