Site icon TeluguMirchi.com

కేజీఎఫ్‌ స్టార్‌తో పూరి నిజమేనా?

‘కేజీఎఫ్‌’ చిత్రంతో ఇండియా మొత్తం గుర్తింపు దక్కించుకున్న కన్నడ స్టార్‌ యష్‌. ఈయన ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ 2’ చిత్రంలో నటిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నిల్‌ తెలుగులో ఒక చిత్రం చేయబోతున్నాడు. మైత్రి మూవీస్‌ వారు అందుకోసం చర్చలు కూడా జరిపారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే కేజీఎఫ్‌ హీరో యష్‌ మన దర్శకుడు పూరి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో సినిమా అంటే ఈమద్య కాలంలో తెలుగు హీరోలు కాస్త వెనుకంజ వేస్తున్నారు. అయితే ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మరోసారి తన సత్తాను పూరి చాటాడు. అయినా కూడా స్టార్‌ హీరోల నుండి ఈయనకు పిలుపు రావడం లేదట. దాంతో కన్నడ స్టార్‌ యష్‌తో పూరి సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో యష్‌ పూరి దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపించాడు. అందుకే ఇప్పుడు పూరి ఒక మంచి కథతో యష్‌ వద్దకు వెళ్లబోతున్నాడు. ఒక వేళ యష్‌ కనుక ఒప్పుకుంటే పూరి ఒక మాస్‌ మసాలా యాక్షన్‌ సినిమాను తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Exit mobile version