Site icon TeluguMirchi.com

13 ఏళ్ల తర్వాత పూరి బ్యాంక్ ఫుల్ అయ్యిందట ..

డాషింగ్ డైరెక్టర్ పూరి హిట్ కొట్టాడు..హిట్ అంటే మాములు హిట్ కాదు..13 ఏళ్ల తర్వాత తన బ్యాంక్ అకౌంట్ ఫుల్ ఆయె రేంజ్ లో హిట్ కొట్టాడు. 13 ఏళ్ల క్రితం ‘పోకిరి’ సినిమాతో కోట్లు ఆర్జించిన పూరి.. మళ్లీ ఇన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో నిర్మాతగా లాభాలను అందుకున్నాడు. గత కొంతకాలం గా హిట్ అంటే తెలియని పూరి..తాజాగా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసి..నిర్మించాడు. ఈ సినిమా జులై 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

కలెక్షన్ల తాలూకా వివరాలు బయటకు వచ్చి అందర్నీ షాక్ లో పడేస్తున్నాయి. మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్లు రాబడుతోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.29.93 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్‌ను వసూలు చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం గ్రాస్ సుమారు రూ.65 కోట్లని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో రూ.26.68 కోట్ల షేర్‌ను వసూలు చేసిందట. ఇక ఓవర్సీస్‌లో సుమారుగా రూ. 1.15 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను పూరి జగన్నాథ్ రూ.17 కోట్లకు విక్రయించారట. ప్రస్తుత కలెక్షన్లు బట్టి చూస్తే ఇప్పటికే లాభం రూ.12 కోట్లు దాటింది. ఇంకా అన్ని చోట్ల హౌస్ ఫుల్ తో రన్ అవుతుండడం తో లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏరియా వైజ్ 12 రోజుల షేర్ చూస్తే..

నైజాం – రూ. 9.92 కోట్లు
సీడెడ్ – రూ. 5.25 కోట్లు
నెల్లూరు – రూ. 1.03 కోట్లు
గుంటూరు – రూ. 1.78 కోట్లు
కృష్ణా – రూ. 1.85 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 1.55 కోట్లు
తూర్పు గోదావరి – రూ. 1.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.50 కోట్లు
మొత్తం ఏపీ, తెలంగాణ షేర్: రూ. 26.68 కోట్లు

దేశంలోని ఇతర ప్రాంతాల్లో – రూ. 2.10 కోట్లు
ఓవర్సీర్ – రూ. 1.15 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా షేర్: రూ. 29.93 కోట్లు.

Exit mobile version