Site icon TeluguMirchi.com

స్టెప్పులేసిన పూరి జ‌గ‌న్నాథ్‌

Puri-jagannath-in-iddarammaతెర‌పై దర్శకులు క‌నిపించి అప్పుడ‌ప్పుడూ హంగామా చేస్తుంటారు. ర‌విబాబు… త‌న సినిమాలో త‌ప్పకుండా ఒక్కసారైనా మెరుస్తారు. రాజ‌మౌళి అయితే మ‌గ‌ధీర‌కి త‌న టీమ్ అంద‌రి చేతా స్టెప్పులేయించారు. ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ వంతు వ‌చ్చింది. ‘ఇద్దర‌మ్మాయిల‌తో’ సినిమాలో పూరి స్టెప్పులేశాడ‌ట‌. టాప్ లేచిపోద్ది… అనే పాట చివ‌ర్లో బ‌న్నీతో క‌లిసి పూరి కూడా స‌ర‌దాగా కాలు క‌దిపాడ‌ట‌. అంతేకాదు బండ్ల గ‌ణేష్ కూడా చేరి… బ్రహ్మానందంలా కామెడీగా చిందేశాడ‌ట‌. ఇంత కిక్‌ లో ఉన్నారంటే.. సినిమాపై ఎన్నో కొన్ని హోప్స్ వ‌చ్చాన‌న్నమాట‌! మరి ఆ పాట టాప్ లేచిపోయిందో లేదో తెలియాలంటే, పూరిలో డాన్సర్ ని చూడాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version