Site icon TeluguMirchi.com

పూరి చెంపపగల గొట్టిన భార్య


మెగాస్టార్ చిరంజీవి ఉగాది కానుకగా ట్విట్టర్‌లో మెగా ఎంట్రీ ట్వీట్‌లతో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు, పూరీ జగన్నాథ్‌లను ఉద్దేశించి పెట్టిన ట్వీట్‌లు వైరల్ అయ్యాయి. ఇక చిరుకి ఆహ్వానం పలుకుతూ పూరీ ట్వీట్ చేయడంతో పూరికి మాత్రం పగిలిపోయే రిప్లై ఇచ్చారు చిరు.

తాజా చిరు ట్వీట్ గురించి పూరి స్పదించారు. ”చిరంజీవి సర్‌ ట్వీట్‌ నాకొంప ముంచింది. ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఆయన ఎందుకు బ్యాంకాక్‌ టాపిక్‌ ఎత్తారో తెలియదు కానీ… ఆయన ట్వీట్‌ చూసి పక్కనే ఉన్న మా ఆవిడకి అన్నీ ఒకేసారి గుర్తుకొచ్చాయి. నా మీద చెయ్యి చేసుకుంది. ఆయన ట్వీట్‌ ఏంటో కానీ ఇక్కడ నా చెంప పగిలిపోయింది.’ అని నవ్వుతూ అన్నారు పూరి.

Exit mobile version