Site icon TeluguMirchi.com

పునర్నవిపై గెలిచిన బిగ్‌బాస్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఇంట్లో దెయ్యం నాకేం భయం. ఈ టాస్క్‌లో అత్యంత చెత్త ప్రదర్శణ ఇచ్చినందుకు గాను శ్రీముఖి, మహేష్‌ విట్టా ఇంకా పునర్నవిలు శిక్షకు గురైన విషయం తెల్సిందే. నిన్నటి ఎపిసోడ్‌లో ఈ ముగ్గురు కూడా షూస్‌ క్లీన్‌ చేయాలంటూ పనీష్‌మెంట్‌కు గురయ్యారు. శ్రీముఖి షూస్‌ తూడ్చేందుకు సిద్దం అయ్యింది. కాని మహేష్‌ విట్టా మరియు పునర్నవిలు మాత్రం అందుకు అంగీకరించలేదు. మహేష్‌ విట్టాను మెల్లగా శివ జ్యోతి లైన్‌లోకి తీసుకు వచ్చి పాలీస్‌ చేసేందుకు ఒప్పించింది.

పునర్నవి మాత్రం తాను చేయను అంటే చేయను అంటూ భీషించుకు కూర్చుంది. వచ్చే వారం నేరుగా ఎలిమినేట్‌ అయినా కూడా పర్వాలేదు అనుకుని షూస్‌ను పాలిస్‌ చేసేందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆమెపై బిగ్‌బాస్‌ సీరియస్‌ అవుతాడని అంతా అనుకున్నారు. కాని బిగ్‌బాస్‌ చెప్పినట్లుగా పునర్నవి చేసేందుకు సిద్దం అయ్యింది. తప్పనిసరి పరిస్థితులో బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను చేసేందుకు పున్ను ఒప్పుకుంది. సరదాగా నేటి ఎపిసోడ్‌లో ఆమె షూస్‌ పాలిస్‌ చేసింది. నేడు కెప్టెన్సీ టాస్క్‌ కూడా జరుగబోతుంది. ఆ ప్రోమోను మీరు కింద చూడవచ్చు.

Exit mobile version