బిగ్‌బాస్‌లో ఐటెంలుగా రచ్చ చేసిన పునర్నవి, అషు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల రోజులు కూడా షో చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. ఈసారి పెద్దగా గొడవలు లేకుండా చాలా ఆసక్తిగా సాగుతూ వచ్చింది. గత రెండు సీజన్‌లతో పోల్చితే ఈసారి గొడవలు తక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువ అన్నట్లుగా సాగుతోంది. తాజాగా అపీ పీజ్‌ టాస్క్‌లో ట్యాలెంట్‌ ప్రదర్శణ సందర్బంగా అషు రెడ్డి మరియు పునర్నవిలు చేసిన డాన్స్‌లు అల్టిమేట్‌ అంటూ టాక్‌ వస్తుంది.

మొదట పునర్నవి తన ఐటెం సాంగ్‌తో కుమ్మేసింది. యమ ఊపు తెప్పించింది. ఆ తర్వాత అషు తనకు డాన్స్‌ రాదు రాదు అంటూనే ఐటెం సాంగ్‌కు అదిరి పోయే స్టెప్పులు వేసింది. వీరిద్దరు చేసిన ప్రదర్శణకు జడ్జ్‌లుగా ఉన్న శ్రీముఖి మరియు బాబా మాస్టర్‌లు మురిసి పోయారు. ఇక ప్రేక్షకులకు కూడా కన్నుల పండుగ అయ్యింది. వీరిద్దరు చేసిన డాన్స్‌ సూపర్బ్‌ అంటూ సోషల్‌ మీడియాలో కూడా కామెంట్స్‌ వస్తున్నాయి.