షూటింగ్ సమయంలో పూజా హెగ్డే మరియు బన్నీలు చాలా క్లోజ్ అయ్యారట. అందుకే ఇద్దరి మద్య కెమిస్ట్రీ సీన్‌లు బాగా పండాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇద్దరు సన్నిహితంగా ఉండడంతో రొమాంటిక్ సన్నివేశాలు కూడా చాలా నాచురల్‌గా వచ్చాయట. ఇద్దరు ఆఫ్‌స్క్రీన్‌లో కూడా చాలా క్లోజ్‌గా ఉంటున్నారని సమాచారం. ఈ చిత్రంతో పూజా, బన్నీల పరిచయం ఓ రేంజ్‌లో ఉందని, ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కు స్నేహం కూడా కారణం అయ్యిందని తెలుస్తోంది. వీరి రొమాన్స్ పీక్స్‌లో ఉందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.