స్టయిలిష్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘డీజే’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించింది. అవకాశాలు లేని సమయంలో మెగా అవకాశం రావడంతో పూజా ఈ చిత్రంలో అందాల ఆరబోతకు అస్సలు నో చెప్పలేదట. దర్శకుడు అడిగిన దానికంటే ఎక్కువగానే చూపించిందట. బన్నీ, పూజాల రొమాన్స్ కూడా పీక్స్‌లో ఉందట.
షూటింగ్ సమయంలో పూజా హెగ్డే మరియు బన్నీలు చాలా క్లోజ్ అయ్యారట. అందుకే ఇద్దరి మద్య కెమిస్ట్రీ సీన్‌లు బాగా పండాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇద్దరు సన్నిహితంగా ఉండడంతో రొమాంటిక్ సన్నివేశాలు కూడా చాలా నాచురల్‌గా వచ్చాయట. ఇద్దరు ఆఫ్‌స్క్రీన్‌లో కూడా చాలా క్లోజ్‌గా ఉంటున్నారని సమాచారం. ఈ చిత్రంతో పూజా, బన్నీల పరిచయం ఓ రేంజ్‌లో ఉందని, ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కు స్నేహం కూడా కారణం అయ్యిందని తెలుస్తోంది. వీరి రొమాన్స్ పీక్స్‌లో ఉందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.