రంగ‌స్థలం ఫృథ్వీ ట్రాక్ మొత్తం లేపేశారు

రంగ‌స్థలం ఇప్ప‌టికే దాదాపు మూడు గంట‌లుంది. అయినా.. స‌రే `సూప‌ర్ హిట్‌` టాక్ వ‌చ్చేసింది కాబ‌ట్టి – నిడివి పెద్ద స‌మ‌స్య అనిపించ‌డం లేదు. అయితే ఇంత నిడివి ఉన్నప్పటికీ ఇంకొన్ని సీన్లు లేపాశారు. ఓ కామెడీ ట్రాక్ అయితే… మొత్తానికే ఎడిట్ అయిపోయింది. ఇందులో కమెడియన్ పృద్వీ సీన్లు వున్నాయట.

రంగ‌స్థలంలో ఫృథ్వీది ఓ సెప‌రేట్ ట్రాక్ ఉంది. క‌థ‌కీ ఆ ట్రాక్‌కీ సంబంధం లేదు. కానీ.. చాలా బాగా వ‌చ్చింద‌ని టాక్‌. సెకండాఫ్‌లో హ్యూమ‌ర్ మొత్తం ఆ క్యారెక్ట‌ర్ చుట్టూనే తిరుగుతుంద‌ట‌. ఓ సినిమా హిట్ట‌య్యాక‌…తొలగించిన స‌న్నివేశాల్ని మ‌ళ్లీ క‌ల‌ప‌డం మామూలే. కానీ రంగ‌స్థ‌లంకి ఆ ఛాన్స్ లేదు. సినిమా బాగా ఆడుతున్నా… ఇప్ప‌టికే పెరిగిపోయిన లెంగ్త్ దృష్ట్యా.. ఆయా సీన్ల‌ను క‌లలిపే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే ఈ సినిమా ఫుల్ లెంత్ ని అమోజన్ ప్రైమ్ లో చూడొచ్చు.