‘ నాయక్ ‘ సినిమాను అడ్డుకుంటాం

Nayak Movie Stills(2)రామ్ చరణ్ హీరోగా వి.వి.వినాయక్ దర్సకత్వంలో రూపొంది జనవరి 9వ తేదిన విడుదల కాబోతున్న  ‘ నాయక్ ‘ చిత్రంలో లంబాడాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గానీ, వారి మనోభావాలను దెబ్బతీసేలా గానీ ఏమైనా సన్నివేశాలు గాని, సంభాషణలు గాని వుంటే ఆ సినిమా విడుదలను అడ్డుకుంటామని లంబాడా హాకుల పోరాట సమితి హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 6 వ తేదిన వరంగల్ లో ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని సమితి తెలిపింది. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వి.బెల్లయ్యనాయక్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమాను విడుదలకు ముందే తమకు ప్రదర్శించి చూపాలని నిర్మాతలకు సూచించింది. సినిమాలో లంబాడాలను కించపరచే విధంగా సన్నివేశాలు వుంటే తెలంగాణా ఐకాస, ఓయూ విద్యార్ధి సంఘాలతో కలిసి పోరాటం సాగిస్తామని తెలిపారు. కాగా దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ కథ ప్రకారం సినిమాకు ‘ నాయక్ ‘అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని, ఈ చిత్రంలో ఎవరిని కించపరచే అంశాలు ఉండవని, సినిమాలో చరణ్ పాత్ర వినూత్నంగా ఉంటుందని, ఇది పూర్తిగా యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ చిత్రమని తెలిపారు.