ఆడపిల్లను కాపాడండి అంటున్న నాగార్జున

nagarjuna1988 ఆగస్ట్ 15 న కేంద్ర సమాచార శాఖ రూపొందించి విడుదలచేసిన ‘మిలే సుర్ మేరా తుమ్హారా..’ పాట భారతీయతకు అద్దం పట్టింది. సుమారు 14 బాషల్లో సాగే ఈ పాటలో సంగీత కళాకారులు, నటులు,క్రీడాకారులు కనిపించి కనువిందు చేయడమే కాకుండా దేశ ఔన్నత్యానికి ఈ పాట ద్వారా తమ వంతు సహకారం అందించారు. తాజాగా ఇదే తరహాలో కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ (ఆడపిల్లని కాపాడండి) ప్రచారంలో భాగంగా ప్రజలలో అవగాహన కలిగించే నిమిత్తం ఓ మ్యూజిక్ వీడియో ఆల్బంను రూపొందించింది. ఈ ఆల్బంలో హీరో నాగార్జున, హేమమాలిని, శిల్పాశెట్టి, సోనాక్షి సిన్హా, సుస్మితా సేన్ తదితరులు నటించారు. శంకర్మ హదేవన్, సునిధి చౌహాన్ పాడిన ఈ ఆల్బంకు ‘బేటియాన్’ అనే పేరు పెట్టారు. ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? అన్న అంశంపై సినీ ప్రముఖుల చేత చెప్పించడం వల్ల సమాజంపై మంచి ప్రభావం పడుతుందని భావించిన కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని తలపెట్టంది.