డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వంను శాంతింపజేసేందుకు టాలీవుడ్‌కు చెందిన అన్ని వర్గాల వారు ఒక లేఖను రాయడం జరిగింది. ఆ లేఖలో ప్రభుత్వంను రిక్వెస్ట్ చేయడంతో డ్రగ్స్ కేసును కాస్త లైట్ తీసుకున్నారు. ఆ లేఖపై రామ్ గోపాల్ వర్మ చాలా సీరియస్ అయిన విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిరూపితం కాలేదు. కొందరిని విచారించిన సిట్ అధికారులు వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా త్చేలేదు. ఈలోపే ఎందుకు ప్రభుత్వంను క్షమాపణలు అడిగి, వారిని ప్రాదేయపడ్డారు అంటూ వర్మ బహిరంగంగానే టాలీవుడ్ పెద్దలను ప్రశ్నించాడు. వర్మ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది కదా అని అందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజాగా వర్మ వ్యాఖ్యలపై నిర్మాత మండలి అధ్యక్షుడు పి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాము అంతా కలిసి తెలంగాణ ప్రభుత్వంకు రాసిన లేఖను మరోసారి వర్మ చదువుకోవాలని సూచించాడు. ఆ లెటర్‌లో ఎక్కడ కూడా ప్రభుత్వంకు క్షమాపణలు చెప్పడం కాని, ప్రాదేయ పడటం కాని లేదని వర్మ లేని పోని విమర్శలు చేసి వివాదాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.
డ్రగ్స్ తీసుకున్న వారు ఉంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కాని మొత్తం టాలీవుడ్‌ను ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వంను కోరడం జరిగింది. అంతే తప్ప అందులో మరేం లేదని, వర్మ అనవసరంగా రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ నిర్మాతల మండలి అధ్యక్షుడు కిరణ్ అన్నారు. వర్మ వ్యాఖ్యలను పలువురు నిర్మాతలు మరియు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు కూడా కొట్టి పారేస్తున్నాడు. ప్రస్తుతం వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.