మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంతోని మంచి విజయాన్ని అందుకుని ఇక 151వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. గతంలో పక్కకు పెట్టిన స్వాతంత్ర సమరయోధుడు అయిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా చిరు తదుపరి చిత్రం ఉండబోతుంది. చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి పక్కా సమాచారంతోనే తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూనిట్ వారు లండన్‌లో కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాజాగా చిరు చేయబోయే ‘ఉయ్యాలవాడ’ చిత్రంపై నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విన్నవించుకున్నాడు.
మహానటుడు అయినా చిరంజీవి గారు ‘ఉయ్యాలవాడ’ జీవితం అంతా పోరాట మయం, ఆయన స్వాతంత్రం కోసం ఎంతో పోరాటం చేశాడు, చివరకు తాను మరణించిన వందేళ్లకు అయినా స్వాతంత్రం సిద్దించాలని ఆశించాడు. అనుకున్నట్టుగానే ఉయ్యాలవాడ మరణించిన వందేళ్లకు స్వాతంత్రం వచ్చింది. ఈ చిత్రం యువతకు స్పూర్తి దాయంగా ఉండాలి తప్పితే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చారిత్రక వీరుడి చరిత్రను దిగదార్చకండి అంటూ చిరుకు విన్నపం లాంటి డిమాండ్‌ను చేశాడు. కల్పిత కథ అయితే ఎన్ని రకాలుగా అయినా చూపించొచ్చు కానీ చారిత్రక విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని సినీ ప్రముఖులు అంటున్నారు.