కొత్త నటీనటులు కూడా దిల్‌రాజు బ్యానర్లో పరిచయం అయితే వారితో ముందే ఒప్పందం చేసుకుంటాడు. నేను కోరినప్పుడు మళ్లీ నా బ్యానర్లో నటించాలని, అందుకు వారు ఓకే చెప్పి అగ్రిమెంట్ కూడా ఇస్తారు. ఇక హీరోలను కూడా తన బుట్టలో వేసుకోవడంలో దిల్‌రాజు తర్వాతే ఏ నిర్మాత అయినా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారి దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేస్తే మళ్లీ మళ్లీ ఆయన నిర్మాణంలో చేసేందుకు సిద్దం అవుతారు. ఇటీవలే ‘నేను లోకల్’ చిత్రాన్ని దిల్‌రాజు బ్యానర్లో నాని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత ఇప్పుడు రెండు సినిమాలు చేసేందుకు నాని ఇప్పటికే దిల్‌రాజుకు గ్రీన్ స్నిగల్ ఇచ్చాడు. ఇక శర్వానంద్‌తో ‘శతమానం భవతి’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించాడు.
ఆ సమయంలోనే దిల్‌రాజుకు మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇక సాయి పల్లవిని ‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు దిల్‌రాజు తీసుకు వచ్చాడు. ఆమె వల్ల దిల్‌రాజుకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాని దిల్‌రాజు వల్లే తనకు మేలు జరిగిందని సాయి పల్లవి భావించి, వరుసగా దిల్‌రాజు బ్యానర్లో మూడు సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యింది. ఇలా ఆయనతో ఒక్కసారి పని చేసిన వారు దిల్‌రాజుతో ఏదో కారణంగా మళ్లీ చేస్తారు. సక్సెస్ అయితే దిల్‌రాజు వారిని వదిలి పెట్టడు అనే విషయం తెల్సిందే. అందుకే టాలీవుడ్ వర్గాల వారు దిల్‌రాజు పెద్ద మోనార్క్ అంటూ ఉంటారు.