Site icon TeluguMirchi.com

ప్రియాంక – నిక్ ల పెళ్లి ఫై క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి

హాలీవుడ్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ తో బాలీవుడ్ లో మంచి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా నిశ్చితార్ధం అయిన విషయాన్నీ బయటపెట్టి తన నిశ్చితార్ధపు ఉంగరాన్ని బహిరంగపరిచింది. అయితే తాజాగా వీరి నిశ్చితార్థం గత శుక్రవారం జరగనున్నట్లు తెలుస్తోంది. శనివారం ప్రియాంక నివాసంలో పూజలు (రోకా) నిర్వహించారు. ఇక త్వరలోనే మా వివాహం ఉంటుందని ఆమె వెల్లడించారు. అయితే ఆమె వివాహం రానున్న అక్టోబర్ లో జరుగుతుందని, వేదిక ఫలానా చోట అంటూ కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి.

ఈ రోజు ఒక ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ తో ప్రియాంక తల్లి మధు చోప్రా ఇప్పటివరకు ప్రియాంక, నిక్ ల పెళ్లి తేదీని ఖరారు చేయలేదని తెలిపారు. అలానే వివాహ వేదిక కూడా ఖరారు కావలసి ఉందని అన్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ కూడా వట్టి పుకార్లేనని, వారిద్దరూ వివాహానికి కొంతసమయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. వివాహ తేదీ మరియు వివాహ వేదిక ఖరారు అయితే అందరికి తెలియపరుస్తామని, ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఆమె అన్నారు. ప్రియాంక, నిక్ ల వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరగాలని తాను కోరుకుంటున్నానని, ఇదే విషయాన్నీ నిక్ తల్లితండ్రులకు కూడా చెప్పాను. నిక్ మరియు అతని తల్లితండ్రులు చాలా మంచి వారని, మా కుమార్తకు అటువంటి భర్త మరియు అత్త మామలు దొరికినందుకు తనకు చాల సంతోషంగా ఉందని ఆమె మీడియాకు చెప్పుకొచ్చారు.

Exit mobile version