తాజాగా బాలీవుడ్ క్రేజ్ బ్యూటీ ప్రియాంకచోప్రా , సూర్య తో జోడి కట్టబోతుందని తమిళ్ వర్గాల సమాచారం. ప్రియాంక చోప్రా ఇంతకుముందు విజయ్ సరసన తమిళన్ అనే చిత్రంలో నటించి తమిళ్ ఆడియన్స్ కి దగ్గరయ్యింది. ఇన్నాళ్లకు సూర్యకు జంటగా నటిస్తుందనే వార్త తెలుసుకొని సంతోషిస్తున్నారు.
తమిళం, తెలుగు, హిందీ మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ బాలీవుడ్ దర్శక నిర్మాత నందిత సింఘాతో కలసి నిర్మించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. సూర్య సొంతంగా 2డి ఎంటర్టైన్మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే వరుసగా నాలుగు చిత్రాలను నిర్మిస్తున్నారు.