చ‌ర‌ణ్ నేర్పించాడ‌ట‌!

priyanka-chopraప్రియాంకా చోప్రా- రామ్‌చ‌ర‌ణ్ ఇద్దరూ ఒక‌రి కొక‌రు బాగా నేర్పించుకొన్నారు. అదేనండీ.. భాష‌లు! చ‌ర‌ణ్‌కి హిందీ వస్తుంది. కానీ… హైద‌రాబాద్ యాస‌లో మాట్లాడ‌తాడు. అది బాలీవుడ్‌కి త‌గిన‌ట్టు ఎలా మార్చుకోవాలో నేర్పించింది. బుదులుగా రామ్‌చ‌ర‌ణ్ ప్రియాంకాకి తెలుగు నేర్పాడ‌ట‌. ఈ విష‌యం ప్రియాంకానే చెబుతోంది. ”ఈ సినిమాని తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి చిత్రీక‌రించారు. హిందీలో నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. తెలుగులో మాత్రం కాస్త క‌ష్టప‌డ్డా. ఎందుకంటే సుదీర్ఘమైన డైలాగులున్నాయి. వాటిని అర్థం చేసుకొని ప‌ల‌క‌డం క‌ష్టం అనిపించింది. ఈ విష‌యంలో చ‌ర‌ణ్ నాకు స‌హ‌క‌రించాడు. కొన్ని డైలాగులు నేర్పించాడు” అంది. అంతేకాదు, చ‌ర‌ణ్‌ని ప్రశంస‌ల‌తో ముంచెత్తింది. ”చ‌ర‌ణ్ మంచి న‌టుడు. అత‌ని డాన్స్ మూమెంట్స్ సూప‌ర్‌. బాలీవుడ్‌లో కూడా నిల‌దొక్కుకొంటాడు..” అంటోంది.