ప్రియ‌మ‌ణి పండ‌గ చేసుకొంటోంది

priyamani-in-IPLసినిమాల్లేక‌నో, ఏమో తెలీదుగానీ… వీలైనంత వ‌ర‌కూ క్రికెట్ గ్రౌండ్‌లోనే ద‌ర్శన‌మిస్తోంది ప్రియ‌మ‌ణి. సీసీఎల్ సీజ‌న్‌ లో ఎక్కిన క్రికెట్ పిచ్చి.. ఐపీఎల్‌కీ కంటిన్యూ చేస్తోంది. ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క్రికెట్ మ్యాచ్‌ ల్లోనే క‌నిపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి మ‌ద్దతు తెలుపుతూ… ఆ జ‌ట్టు జండాల‌ను తెగ ఊపేస్తోంది. అక్కడితో ఆగ‌డం లేదు. ట్విట్టర్ డ‌బ్బా తెరచి అందులోనూ క్రికెట్ క‌బుర్లు పంచుకొంటోంది. సన్ రైజర్స్ కి మించిన జట్టు లేద‌ని.. డ‌బ్బా కొడుతోంది. ఆ జ‌ట్టుకు వ్యతిరేకంగా ఎవ‌రు మాట్టాడినా ఒప్పుకోవ‌డం లేదు. మా స‌త్తా చూపిస్తాం.. అంటోంది. ప్రియ‌మ్మ మ‌రీ ఇంతిలా.. క్రికెట్ కి బాసిసైపోయిందేంటి? అదే అర్థం కావ‌డం లేదు. బ‌హుశా.. సన్ రైజర్స్ హైదరాబాద్ కి మ‌ద్దతు తెలిపితే… డ‌బ్బులిస్తామ‌ని చెప్పారేమో? మొత్తమ్మీద క్రికెట్ గ్రౌండ్‌ లో పండ‌గ చేసుకొంటోంది ప్రియ‌మ్మ‌.