Site icon TeluguMirchi.com

ప్రేమిస్తా… పెళ్లాడ‌తా..

priyamaniప్రియ‌మ‌ణి మ‌న‌సు ప్రేమ‌, పెళ్లిపై లాగుతుందేమో..? ప్రేమించే పెళ్లిచేసుకొంటా… అనేస్తోంది. ప్రస్తుతం ప్రియ‌మ‌ణి కెరీర్ అటూ ఇటూ కాన‌ట్టు త‌యారైంది. చేతిలో చండీ సినిమా ఉన్నా దానిపై ఎవ‌రికీ న‌మ్మకాల్లేవు. చెన్నై ఎక్స్ ప్రెస్‌లో ఐటెమ్ సాంగ్ చేసినా దాని వ‌ల్ల ఒరిగిందేం లేదు.. అందుఏకే సినిమాకు పుల్ స్టాప్ పెట్టి, జీవితంలో స్థిర‌ప‌డాల‌ని నిర్ణయించుకొందేమో…? స‌డ‌న్ గా పెళ్లి టాపిక్ ఎత్తింది. ”నాకు బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకొంటా. ఎందుకంటే పెళ్లి అనేది జీవితాంతం ఉండాల్సిన బంధం. ఎవ‌రి ముందో త‌ల‌వంచి తాళి క‌ట్టించుకోలేను. అది నా స్వభావానికి విరుద్ధం. ప్రేమ పెళ్లిళ్లపై నాకెంతో న‌మ్మకం ఉంది” అంటోంది. అంటే ప్రియ‌మ‌ణి ప్రేమ‌లో ప‌డిన‌ట్టే క‌దా?

Exit mobile version