Site icon TeluguMirchi.com

ప్రియ‌మ‌ణి మ‌న‌సు ‘గేల్‌’చాడు!

priyamaniవెస్టీండీస్ విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌పై మ‌న‌సు పారేసుకొంది ప్రియ‌మ‌ణి. అత‌ని ఆట తీరుకు జోహారులు అర్పించుకొంది. క్రిస్ బ్యాటింగ్ తీరు అమోఘం…. అద్భుతం అంటూ త‌న‌కు తెలిసిన ప‌దాల‌న్నీ ఉప‌యోగించేస్తోంది. మంగ‌ళ‌వారం పుణె తో జ‌రిగిన మ్యాచ్‌ లో క్రిస్ విధ్వంసం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మ్యాచ్ ఆసాంతం తిల‌కించిన ప్రియ‌మ‌ణి గేల్ బ్యాటింగ్‌కి ప‌డిపోయింది. అత‌ని జోరుకు ఫిదా అయిపోయింది. వెంట‌నే ట్విట్టర్‌ లో గేల్ బ్యాటింగ్‌ ని శ్లాఘిస్తూ… ప్రశంస‌లు పంపింది. ”గేల్ బ్యాటింగ్ చూస్తుంటే మాట‌లు రావ‌డం లేదు. ప్రత్యర్థుల‌కు చుక్కలుచూపించి… నా అభిమానాన్ని చొర‌గొన్నాడు” అనేది ఆ సందేశంలోని సారాంశం. ప్రియ‌మ‌ణికి ఈ క్రికెట్ పిచ్చి చిన్నప్పటి నుంచీ ఉంద‌ట‌. ఐపీఎల్‌ తో మ‌రింత ఎక్కువైన‌ట్టుంది. ఈ పిచ్చి ఇక్కడితో ఆగుతుందో లేదో??

Exit mobile version