Site icon TeluguMirchi.com

ప్రియదర్శి పెళ్లి డేట్ ఫిక్స్

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది పెళ్లి చూపులు. ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు ఈ సినిమా పై ప్రసంశల వర్షం కురిపించారు. కాగా ఈ సినిమాలో హీరోకి స్నేహుతుడిగా నటించి ప్రియదర్శి టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు. ప్రియదర్శి నటన ప్రేక్షకులను విపరీతంగాఅలరించింది. ఈ సినిమా తర్వాత ప్రియదర్శికి అవకాశాలు ముంచుకొచ్చాయి.

వరుస సినిమాలతో బిజీగా వుంటున్న ప్రియదర్శి ఇప్పుడు కొత్త ఇన్నింగ్ మొదలుపెట్టనున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే జీవిత భాగస్వామి రిచాను అభిమానులకు పరిచయం చేశాడు ప్రియదర్శి. ”నీ అందమైన హృదయం గురించి రాయడానికి కచ్చితంగా లక్షల కొద్దీ పదాలు, పద్యాలు కావాలి. అయినా ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటా. అంతకుమించి ఏమీ చేయలేను. నిన్ను నా జీవితంలో తీసుకొచ్చిన విధికి ధన్యవాదాలు. హ్యాపీబర్త్‌డే రిచా.” అంటూ ఓకే పోస్ట్ పెట్టాడు.

తాజాగా వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని వార్తలు ఫిలిం నగర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్‌లో ప్రియదర్శి వివాహం జరగనుంది. తరువాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం 26న గ్రాండ్‌ గా రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారని భోగట్టా.

Exit mobile version