Site icon TeluguMirchi.com

35 Chinna Katha Kaadu : లెక్కలు మాస్టారుగా మారిన ప్రియదర్శి.. పిల్లలు జాగ్రత్త మరి !


35 CKK : నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ’35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read : ‘సరిపోదా శనివారం’ నుంచి నాని పవర్ ప్యాక్డ్ లుక్ రిలీజ్

ఈ రోజు మేకర్స్ లెక్కల మాస్టారు M. చాణక్య వర్మ గా యాక్టర్ ప్రియదర్శిని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. లెక్కలు మాస్టారు గా ప్రియదర్శి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగా వుంది. లుక్, పెర్ఫార్మన్స్ చాలా నేచురల్ గా వున్నాయి. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది.

Also Read : VD12 : విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..

పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ’35-చిన్న కథ కాదు’ ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

35 seconds of Chanakya | Glimpse | 35 Chinna Katha Kaadu | Nivetha Thomas, Priyadarshi, Viswadev

Exit mobile version