నిన్నటి వరకు ఆమె పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ నేడు ఆమె పేరు దేశం యావత్తు మార్మోగుతోంది. కనుకట్టుతో కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ఆమె పేరు ప్రియ ప్రకాశ్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ సినిమా టీజర్లో తన హావభావాలతో కనికట్టు చేసిన ఆమె .. మాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా హీరోలని, నిర్మాతలని, దర్శకులని ఆకర్షించింది . రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన ఈమెతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇక ఈ విషయంలో టాలీవుడ్ ఒక అడుగు ముందే ఉంది.. ‘పెళ్ళి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నిఖిల్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్టు పరిశ్రమలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం విషయమై ఇప్పటికే చిత్ర బృందం ప్రియాని సంప్రదించగా….ఈమె డేట్స్‌ను చూస్తున్న దర్శకుడు ఒమర్ లులు….రూ.2 కోట్లు డిమాండ్ చేసారని టాక్.