ఇక ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే..మళయాలంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్‌కు రీమేక్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రేమమ్ ఓపెనింగ్స్‌లో సత్తా చాటింది. గురువారం ప్రీమియర్స్, శుక్రవారం.. కలుపుకొని యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 209కే డాలర్లు (సుమారు 1.39 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ జోరు ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించడం జరిగింది.