‘ ప్రేమమ్ ‘ యుఎస్ కలెక్షన్స్..

premamనాగ‌చైత‌న్య‌, శృతీహాస‌న్‌, మ‌డోన్నా స్టెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా మలయాళ సూపర్ హిట్ ఫిలిం ప్రేమమ్ చిత్రాన్ని తెలుగు అదే టైటిల్ తో రీమేక్ అయినా సంగతి తెలిసిందే..ఈ చిత్రం గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకోవడమే కాదు , చైతు కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి వసూళ్లు రాబడుతుంది..

ఇక ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే..మళయాలంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్‌కు రీమేక్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రేమమ్ ఓపెనింగ్స్‌లో సత్తా చాటింది. గురువారం ప్రీమియర్స్, శుక్రవారం.. కలుపుకొని యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 209కే డాలర్లు (సుమారు 1.39 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ జోరు ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించడం జరిగింది.