ఓవర్సీస్ లో ‘ప్రేమమ్’ 1 మిలియన్ సాధిస్తుందా..?

premamమలయాళం లో సూపర్ హిట్ సాధించిన ‘ప్రేమమ్ ‘ చిత్రాన్ని తెలుగు లో అదే పేరుతో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..నాగ‌చైత‌న్య‌, శృతీహాస‌న్‌, మ‌డోన్నా స్టెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మ రధం పడుతున్నారు. చైతు కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదయ్యింది.

ఇక ఈ చిత్ర ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 590కే డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఈ వారం కూడా పెద్దగా సినిమాలేవీ లేకపోవడంతో ప్రేమమ్ ఇదే జోరు కొనసాగిస్తుందని ట్రేడ్ అంచనా. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ వారాంతం పూర్తయ్యే సరికి 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఖాయమంటున్నారు. మరి చైతు ఆ మిలియన్ మార్క్ కొడతాడా లేదనేది చూడాలి. చందూ మొండేటి దర్శకత్వంలో తెలుగు ప్రేమమ్ తెరకెక్కింది.