Site icon TeluguMirchi.com

‘ప్రేమమ్’ శాటిలైట్ రైట్స్ అదిరిపోయాయి..

premam-release-dateఅక్కినేని నాగ చైతన్య , శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’.

ప్రస్తుతం షూటింగ్ చివరి భాగం లో ఉన్న ఈ చిత్రానికి సంబదించిన శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసారు జీ టీవి వారు. దాదాపు రూ. 6 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మళయాళంలో సూపర్ హిట్ చిత్రం కావడంతో తెలుగు ప్రేమమ్ శాటిలైట్ కి బంపర్ రేటు దక్కిందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సెప్టెంబర్ 20న చిత్ర ఆడియో రిలీజ్ జరపనున్నారు. ‘దసరా’ కానుకగా అక్టోబర్ 7న ‘ప్రేమమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;
ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి

Exit mobile version