పుట్టిన రోజే… ‘ప్రేమ కథా చిత్రమ్’

prema-katha-chitramసుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ప్రేమ కథా చిత్రమ్’ విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రాన్ని హీరో సుదీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మే 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో దర్శకుడు మారుతి వద్ద సినిమాటోగ్రాఫర్ పనిచేసిన జె. ప్రభాకర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మారుతి స్టోరీ, డైలాగులను అందించారు. జె బి సంగీతాన్ని అందిచిన ఈ చిత్రం ఆడియో ఇటివలే మహేష్ ఆవిష్కరించారు. ఈ సినిమాలో రేమిక్స్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ పాటలలో ఒకటైన ‘వెన్నెలైన చికటైన’ పాట ఈ సినిమాకి హైలైట్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం స్టోరి లైన్ … ‘ప్రేమంటే గెలుపే కాదు. ఒక్కోసారి ఓటమి కూడా ఉంటుంది. ప్రేమలో ఓడిపోయిన ఓ జంట తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనే ఆసక్తికరమైన కథాంశంతో ‘ప్రేమ కథా చిత్రమ్’ ను తెరకెక్కించినట్లు దర్శకుడు చెబుతున్నారు.