లాస్య గర్భవతి… వారికి దండేసి దండం పెడతా

బుల్లితెర మీద పద్దతిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన యాంకర్‌ లాస్య మూడు నెలల క్రితం మంజునాథ్‌ అనే మరాఠా కుర్రాడిని పెళ్లాడిరది. పెళ్లికి ముందు పలు పుకార్లతో తరుచుగా మీడియాలోకి వచ్చే లాస్య పెళ్లి అయిన తర్వాత అయినా తనపై పుకార్లు ఆగతాయని భావించింది. కానీ ఇప్పటికి లాస్య తరుచుగా వార్తల్లో నానుతూ ఉంటునే ఉంది. తాజాగా లాస్య గర్భవతి అని సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రెగ్నెన్సీ వల్లనే బుల్లి తెరకు దూరంగా ఉంటుంది అని, పిల్లలు అయ్యాక అయినా లాస్య మళ్లీ బుల్లితెర మీదకు దర్శణం ఇస్తుందా అన్నట్టు తెగ ప్రచారం జరుగుతోంది.

ఈ పుకార్లు ఆ నోటా ఈ నోటా లాస్య దాకా చేరాయి. ఈ పుకార్లను చూసి లాస్య ఒక్క సారిగా నివ్వెరపోయింది. తాను గర్భవతి అని రాసిన వారికి ఆ వార్త ఎవరు చెప్పారు అని, ఇలాంటి వార్తలు రాయడం ఇకనైనా మానరా అంటూ అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇలాంటి పుకార్లు రాసే వారు నాకు కనిపిస్తే వారికి దండేసి దండం పెడుతా బాబు అంటూ, తనపై వస్తున్న పుకార్లను అవలీలగా కొట్టిపారేసింది. తనకు పిల్లలు పుట్టడానికి మరో రెండేళ్ల సమయం ఉందని లాస్య ఓ ఇంటర్య్వూలో చెప్పింది. భవుశా అప్పటికే ప్లాన్‌ చేసుకుంటుదేమో! ఇవి అయితే తప్పుడు వార్తలే అని తేల్చి చెప్పింది.