Site icon TeluguMirchi.com

Prasanna Vadanam Review : ప్రసన్న వదనం రివ్యూ: కాన్సెప్ట్ కి క్లాప్స్ కొట్టాల్సిందే

TeluguMirchi Rating : 3.25/5

వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు సుహాస్. ఇప్పుడు కొత్త దర్శకుడు అర్జున్ తో ‘ప్రసన్న వదనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్, సుకుమార్ శిష్యుడు కావడం విశేషం. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. మరా అంచనాలని సినిమా అందుకుందా? కాన్సెప్ట్ లోని కొత్తదనం థ్రిల్ ఇచ్చిందా?

సూర్య(సుహాస్)కి ఒక యాక్సిడెంట్ లో అమ్మ నాన్నలని కోల్పోతాడు. ఈ యాక్సిడెంట్ వల్ల సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రుగ్మత వస్తుంది. దీనికారణంగా ఎవరి మొహాలను గుర్తుపట్టలేడు. ఆర్జే గా పని చేస్తున్న సూర్య తన గతంలోని బాధలు మర్చిపోయి హాయిగా సాగిపోతున్నసమయంలో ఎవరో దుండగుడు అమృత (సాయి శ్వేత)ని లారీ కిందకి తోసి మర్డర్ చేయడం చూస్తాడు. కానీ ఆ తోసేసిన వ్యక్తి ఎవరో తన ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల గుర్తుపట్టలేడు. కానీ ఏదో ఒకటి చేయాలని పోలీసులకు బయట కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు. ఈ కేసుని ఎసిపీ వైదేహి(రాశీసింగ్) టేకాప్ చేస్తుంది? అయితే అనుకోకుండా సూర్య అదే మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు హత్యకు గురైన అమృత ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు చంపారు? ఈ కేసు వలన సూర్యకి కి ఎదురైనా ఇబ్బందులు ఏంటి? చివరికి హంతకుడు దొరికాడా ? అనేది మిగతా కథ

ఈ రోజుల్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే కంటెంట్ లో ఎదో కొత్త కాన్సెప్ట్ ఉండాల్సిందే. అలాంటి కొత్త కాన్సెప్ట్ ప్రసన్నవదనంలో కుదిరింది. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ ని ఓ మర్డర్ కేసుకి బ్లెండ్ చేసిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సూర్య క్యారెక్టరైజేషన్, అధ్య( పాయల్ రాధాకృష్ణ) తో లవ్ ట్రాక్ ఆసక్తికరంగా చూపించారు. సూర్య మర్డర్ చూసిన దగ్గర్నుంచి కథ థ్రిల్లర్ జోనర్ లోకి మారుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా దర్శకుడు కథని మరింతగా పరుగులు పెట్టించాడు. ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం సాగదీత ఉన్నప్పటికీ క్లైమాక్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా మలిచాడు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా షాకింగ్ గా వుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించరు.

సుహాస్ మరోసారి తన నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. మనుషుల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో బాధపడే సన్నివేశాల్లో తన నటన ఎమోషనల్ గా కట్టిపడేస్తుంది. ఇందులో తను చేసిన రియల్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బావున్నాయి. పాయల్ రాధాకృష్ణ క్యూట్ గా వుంది. ఈ సినిమాలో రాశీసింగ్ నటనకు గురించి చెప్పకూడదు. తెరపై చూడాల్సిందే. నితిన్ ప్రసన్న కూడా ఆకట్టుకుంటాడు, వైవా హర్ష, నందు, సత్య పరిధిమేరకు వున్నారు.

టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా వుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బలాన్ని తీసుకొచ్చాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కి దర్శకుడు ఈ కాన్సెప్ట్ ని యాడ్ చేసి క్లాప్స్ కొట్టించాడు. ఫేస్ బ్లైండ్ నెస్ తో పాటు దర్శకుడు కథలో రాసుకున్న మలుపులు మెప్పిస్తాయి. మంచి కంటెంట్ వున్న థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకు ప్రసన్న వదనం పెర్ఫెక్ట్ ఛాయిస్.

Exit mobile version