పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన ప్రణీత తల్లికాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ” నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు” అని తన ఆనందాన్ని తెలిపింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని గతేడాదిలో వివాహం చేసుకున్న ప్రణీత ..ఇప్పుడు తల్లి కాబోతుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే ..దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రణీత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘బ్రహ్మోత్సవం’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.